సింగరేణి సీఅండ్‌ఎండీకి మరో అవార్డు

సింగరేణి సంస్థ సీఅండ్‌ఎండీ ఎన్‌.శ్రీధర్‌ను మరో అవార్డు వరించింది. థాయలాండ్‌ నుంచి ప్రచురితం అవుతున్న ప్రముఖ పత్రిక ఏషియా వన్‌ వారు ఆసియా దేశాల్లో వ్యాపార, వాణిజ్య పరిశ్రమల విభాగంలో అత్యంత ప్రతిభావంతులైన సీఈఓలకు ఇచ్చే అవార్డుకు ఈసారి శ్రీధర్‌ను ఎంపిక చేసింది. ఈమేరకు  బ్యాంకాక్‌(థాయ్‌లాండ్‌)లో మారియట్‌ మార్కిస్‌ హోటల్‌లో 13వ ఏషియన్‌ బిజినెస్‌ అండ్‌ సోషల్‌ ఫోరం సదస్సులో ప్రతిష్టాత్మక ‘భారతీయ మహంతం పురస్కార్‌-2019-2020’, ద లీడర్‌ అవార్డును సింగరేణి సీఎండీ స్వీకరించారు. అత్యంత వైభవోపేతంగా జరిగిన ఈ అంతర్జాతీయ సదస్సులో ముఖ్య అతిథులు మొరాకో దేశ రాయబారి అబ్దెలిల్లామ్‌ అల్‌ హోస్నే, మాల్దీవ్స్‌ రాయబారి మహ్మద్‌ జిన్నాల చేతుల మీదుగా శ్రీధర్‌ ఈ అవార్డును అందుకున్నారు.